Sircilla: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు!
Sircilla: ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష.
Sircilla: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు!
Rajanna Sircilla: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్, వాహనాలు, ఇతర అంశాలపై పౌర సరఫరాల శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సహకార శాఖ, మెప్మా, రవాణా శాఖ, తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సోమవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్య, గన్ని సంచులు, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసి వేశారు.. తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
అపరెల్ పార్క్, గోదాములకు ధాన్యం తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని, కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి అయిన కేంద్రాల నుంచి హమాలీలను అన్ లోడింగ్ కు వినియోగించాలని సూచించారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు, తరలింపు, అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. వర్షంతో జిల్లాలో ఎక్కడైనా ధాన్యం తడిసి ఉంటే వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.




