Sircilla: వరి తగ్గించి పప్పుధాన్యాలు కూరగాయల సాగుపై అవగాహన కల్పించాలి!

Sircilla: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 16 July 2026 11:04 PM IST
Sircilla
X

Sircilla: వరి తగ్గించి పప్పుధాన్యాలు కూరగాయల సాగుపై అవగాహన కల్పించాలి!

సిరిసిల్ల: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.విద్య, వ్యవసాయం, వైద్యారోగ్యం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు.

సమావేశంలో యూడైస్ నమోదును ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని, కేంద్రీకృత ఆహారశాలల ఏర్పాటు వేగవంతం చేయాలని, విద్యార్థులకు యూనిఫాంలు త్వరగా అందించాలని సీఎస్ ఆదేశించారు.

వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పంట మార్పిడి, ఆయిల్ పామ్, కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అలాగే కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. యూడైస్ అమలులో జిల్లా పనితీరుపై కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను అభినందిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ఎల్ నినో నేపథ్యంలో జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story