Sircilla: ఓటరు జాబితా సవరణలపై సమీక్ష.. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్!
Sircilla: స్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
Sircilla: ఓటరు జాబితా సవరణలపై సమీక్ష.. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్!
సిరిసిల్ల: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, ఎస్ఐఆర్ (ఎస్‌ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాల వారీగా పురోగతిని సమీక్షిస్తూ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉంటే వారిని ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, అనామలీలు, మ్యాపింగ్ సమస్యలు, ఏఎస్‌డీ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫోటో మిస్‌మ్యాచ్ ఉన్న ఓటర్ల వివరాలను తప్పనిసరిగా సరిచేయాలని బీఎల్‌వోలకు ఆదేశించారు.
బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని ఎన్నికల నిబంధనల ప్రకారం నిష్పాక్షికంగా పరిశీలించాలని పేర్కొన్నారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, తహసీల్దార్లు మహేష్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎన్నికల విభాగం అధికారి రెహమాన్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




