Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన ఇసుక రీచ్‌లపై డీఎల్ఎస్సీ సమావేశం!
Sircilla: సిరిసిల్లలో కొత్త ఇసుక రీచ్‌లపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధ్యక్షతన డీఎల్ఎస్సీ సమావేశం.. అధికారులకు కీలక ఆదేశాలు.
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన ఇసుక రీచ్‌లపై డీఎల్ఎస్సీ సమావేశం!
Sircilla: జిల్లాలో నూతన ఇసుక రీచ్‌ల ఏర్పాటుపై జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.
ప్రభుత్వ అభివృద్ధి పనులు, నిర్మాణాలు, వాణిజ్య నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో నూతన ఇసుక రీచ్‌లను అధికారులు పరిశీలించారు. మైనింగ్, నీటిపారుదల, భూగర్భ జలాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు చేపట్టిన పరిశీలనపై సమావేశంలో సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నూతన ఇసుక రీచ్‌ల ఏర్పాటుపై చర్చించినట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
సమావేశంలో టీజీఎండీసీ పీఓ శ్రీనివాస్, మైనింగ్ శాఖ ఏడీ క్రాంతి కుమార్, నీటిపారుదల శాఖ అధికారులు ప్రశాంత్, కిషోర్ కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్లు మహేష్, మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




