Siricilla: సిరిసిల్ల జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం కలెక్టర్
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లిలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. రైతులకు విస్తృత అవగాహన.
Siricilla: సిరిసిల్ల జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం కలెక్టర్
సిరిసిల్ల: దీర్ఘకాలిక ఆదాయం కోసం రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు. రైతు రాజేందర్ రెడ్డి పొలంలో 18 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటి సాగును ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంటల వైవిధ్యీకరణలో భాగంగా జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతు వేదికలు, పీఏసీఎస్‌ల ద్వారా ప్రచారం చేపట్టడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ చేపట్టేందుకు వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో కలిపి 34 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు.
అలాగే జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసిన కలెక్టర్, రైతులు ఫెర్టిలైజర్ యాప్‌లో నమోదు చేసుకుని యూరియాను కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.




