Gambhiraopet: విద్యార్థుల వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్!

Gambhiraopet: కేజీబీవీని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 25 Aug 2026 8:59 PM IST
Gambhiraopet
X

Gambhiraopet: విద్యార్థుల వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్!

గంభీరావుపేట: విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్‌ను పరిశీలించి, తరగతి గదులు, వసతి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్.. నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న టాయిలెట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేసి విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

విద్యాలయంలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

కలెక్టర్ సందర్శనలో సర్పంచ్ మల్లుగారి పద్మ, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈలు అన్వర్, సుమలత, ఎంపీడీవో రాజేందర్, జీసీడీవో పద్మజతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story