Sircilla: సీడబ్ల్యూసీ గోదాం పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ ఆదేశం!
Sircilla: పెద్దూర్ వద్ద నిర్మించనున్న సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాం ప్రతిపాదిత స్థలాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులతో కలిసి పరిశీలించారు.
Sircilla: సీడబ్ల్యూసీ గోదాం పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ ఆదేశం!
సిరిసిల్ల: మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోదాం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం స్థల పరిశీలన నిర్వహించారు.
జిల్లా ఇందిరా మహిళా శక్తి భవనం సమీపంలో ప్రతిపాదిత స్థలాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సీడబ్ల్యూసీ రీజినల్ మేనేజర్ విష్ణువర్ధన్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం, గోదాం నిర్మాణానికి అవసరమైన స్థలం, ప్రతిపాదిత నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందించారు.
ఎన్ని ఎకరాల్లో గోదాం నిర్మించనున్నారు? ఎంత టన్నుల నిల్వ సామర్థ్యం ఉంటుంది? అనే విషయాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాం నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, తహసీల్దార్ మహేష్, సీడబ్ల్యూసీ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




