Sircilla: పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేసి, ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 1 Aug 2026 8:28 PM IST
Sircilla
X

Sircilla: పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

జిల్లాలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 549 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిలో వేములవాడలో 262, సిరిసిల్లలో 287 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు లేవని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియ గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారని, జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ఇప్పటికే 87.42 శాతం పూర్తైందని కలెక్టర్ వెల్లడించారు.

ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. వాటి పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగి, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు.

కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫారం-6, ఓటు బదిలీ చేసుకోవాలనుకునే వారు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story