Sircilla: సత్వర పరిష్కారానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ డెడ్లైన్!
Sircilla: జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 175 అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి ఆదేశించారు.
Sircilla: సత్వర పరిష్కారానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ డెడ్లైన్!
సిరిసిల్ల: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 175 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు.
ఈ వారంలో సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో 6, వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో 4 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితర అధికారులు పాల్గొన్నారు.




