Sircilla: సిరిసిల్లలో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఎరువుల లభ్యతపై అధికారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఉన్నత స్థాయి సమీక్ష.

KALEEM, SIRICILLA
Published on: 4 July 2026 7:50 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష

సిరిసిల్ల: రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు కాలానుగుణ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వ్యవసాయం, ఎరువుల లభ్యత, ఫార్మర్ రిజిస్ట్రీ, వర్షాకాల వ్యాధుల నివారణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

2026–27 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించి రైతులను చైతన్యపరచాలని, పంట మార్పిడి విధానాలు, కూరగాయల సాగు, సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తరించాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువులు కొరత లేకుండా అందుబాటులో ఉండేలా చూడాలని, ఎరువుల అక్రమ రవాణాను కట్టడి చేయాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి కాలానుగుణ వ్యాధుల నివారణకు వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story