Sircilla: రాజన్న సిరిసిల్ల ఐడీఓసీ ప్రజావాణికి 129 దరఖాస్తులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల ఐడీఓసీలో ప్రజావాణికి 129 దరఖాస్తులు. అర్జీలను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులకు ఆదేశం.
Sircilla: రాజన్న సిరిసిల్ల ఐడీఓసీ ప్రజావాణికి 129 దరఖాస్తులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 129 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆర్డీఓ కార్యాలయాల్లో 8 దరఖాస్తులు
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 7 దరఖాస్తులు రాగా, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో ఒక దరఖాస్తు అందింది. ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు.
మండలాల వారీగా 15 దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
గంభీరావుపేట మండలంలో 4, ముస్తాబాద్‌లో 2, తంగళ్లపల్లిలో 2, వీర్నపల్లిలో 1, వేములవాడ అర్బన్‌లో 3, వేములవాడ రూరల్‌లో 2, ఎల్లారెడ్డిపేటలో ఒక దరఖాస్తు వచ్చాయి. బోయినపల్లి, చందుర్తి, ఇల్లంతకుంట, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. స్థానిక ప్రజలు తమ సమస్యలకు సంబంధించి అర్జీలను సంబంధిత కార్యాలయాల్లో అందించాలని సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




