Sircilla: యాక్షన్ ప్యాడీ బకాయిలు చెల్లించని మిల్లర్లపై దృష్టి!
Sircilla: గత మూడు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాక్షన్ ప్యాడీ బకాయిలపై మిల్లర్లకు హెచ్చరిక.
Sircilla: యాక్షన్ ప్యాడీ బకాయిలు చెల్లించని మిల్లర్లపై దృష్టి!
Sircilla: గత మూడు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. యాక్షన్ ప్యాడీ బకాయిలను కూడా సకాలంలో చెల్లించాలని, బకాయిలు చెల్లించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి పౌరసరఫరాల శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎంఆర్ డెలివరీ, యాక్షన్ ప్యాడీ బకాయిల చెల్లింపు, ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైస్ మిల్లర్లు గత మూడు సీజన్ల సీఎంఆర్‌ను గడువులోగా అందించాలని సూచించారు. గతంలో ఉన్న యాక్షన్ ప్యాడీ బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా చెల్లించాలని ఆదేశించారు. బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహించే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.




