Peddapalli: రామగుండంలో అభివృద్ధి పనుల జాప్యంపై జిల్లా కలెక్టర్ సీరియస్

Peddapalli: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలో మున్సిపల్ పనులపై సమీక్ష జరిపి, గోదావరిఖని విఠల్‌నగర్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 28 July 2026 11:11 PM IST
Peddapalli
X

Peddapalli: రామగుండంలో అభివృద్ధి పనుల జాప్యంపై జిల్లా కలెక్టర్ సీరియస్

పెద్దపల్లి జిల్లా:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీయూఎఫ్‌ఐడీసీ (TUFIDC), డీఎంఎఫ్‌టీ (DMFT), ఇతర నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

నేడు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభివృద్ధి పనుల పురోగతి, నిధుల వినియోగం, పనుల నాణ్యతపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా అన్ని పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పనిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను తెలిపారు.

టీయూఎఫ్‌ఐడీసీ, డీఎంఎఫ్‌టీతో పాటు ఇతర నిధులతో చేపట్టిన పనులన్నింటినీ నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రామగుండం మండలంలోని గోదావరిఖని (విఠల్‌నగర్)లో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, భవనాల పరిస్థితి, మౌలిక వసతులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

పాఠశాలకు అవసరమైన అదనపు గదులు, మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంచనాలతో కూడిన సమగ్ర ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని పాఠశాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా అవసరమైన అన్ని చర్యలను ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story