Peddapalli: పెద్దపల్లి జంక్షన్లపై సమగ్ర అధ్యయనం: కలెక్టర్!

Peddapalli: పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రధాన జంక్షన్లను అధ్యయనం చేసి, వన్‌వే విధానం, పశువుల నియంత్రణ చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

RAJU, PEDDAPALLI
Published on: 8 Oct 2026 6:56 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జంక్షన్లపై సమగ్ర అధ్యయనం: కలెక్టర్!

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని జంక్షన్లను సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో డీసీపీ రామ్‌రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని అన్ని ప్రధాన జంక్షన్లను క్షేత్రస్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి గల కారణాలను గుర్తించి, రద్దీ నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వన్‌వే, టూ-వే విధానాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ మార్పులను కనీసం ఒక వారం పాటు పరిశీలించి, ట్రాఫిక్ రాకపోకలపై వాటి ప్రభావం, ఫలితాలను అధ్యయనం చేసిన అనంతరం తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

ట్రాఫిక్ డైవర్షన్‌ ప్రణాళికలను నిబంధనల ప్రకారం రూపొందించి, అవసరమైన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు, మున్సిపల్, రోడ్లు భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రోడ్లపై ఆవులు, గేదెలు, ఇతర పశువులు సంచరించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశువులను రోడ్లపైకి తీసుకురాకుండా స్థానిక సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన మార్పులు, మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి రూపొందించే ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి అమలు వల్ల వచ్చే ఫలితాలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమీక్షలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఆర్ అండ్ బి ఈ ఈ భావ్ సింగ్,ట్రాఫిక్ పోలీసు అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI