Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ వైద్య శిబిరం, ట్రెక్కింగ్ పోస్టర్లు ఆవిష్కరణ!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ ఉచిత వైద్య శిబిరం, సీతమ్మలోద్ది ట్రెక్కింగ్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.

RAJU, PEDDAPALLI
Published on: 24 Oct 2026 1:14 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ వైద్య శిబిరం, ట్రెక్కింగ్ పోస్టర్లు ఆవిష్కరణ!

Peddapalli: జిల్లాలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం ఐడీఓసీలోని తన ఛాంబర్ లో అగ్నివీర్, ఎస్ఎస్సీ జీడీ అభ్యర్థులకు ఉచిత వైద్య శిబిరం, మన జిల్లా - మన ఖిల్లా లో భాగంగా సీతమ్మలోద్ది ట్రెక్కింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు.

అగ్నివీర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో నవంబర్ 12 నుంచి జరిగే ఆర్మీ ర్యాలీకి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు యువశక్తి - పెద్దపల్లి ఆధ్వర్యంలో అక్టోబర్ 31న పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల్లో చిన్న లోపాలతో అనర్హులు కాకుండా ముందుగానే గుర్తించేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కు పోస్టర్ లోని QR కోడ్ ను స్కాన్ చేయాలని, వివరాలకు 7780543055, 9182691655 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

నవంబర్ 1న నిర్వహించే సీతమ్మలోద్ది ట్రెక్కింగ్ లో ఇప్పటికే 250 మంది రన్నర్స్ నమోదు చేసుకున్నారని తెలిపారు. సీతమ్మలోద్దిలో 1000-1200 ఏళ్ల నాటి ప్రాచీన గుహ చిత్రాలు, పిడుగుతొర్ర, భీమన్న ఆలయం వంటి ప్రదేశాలను సందర్శించనున్నారు. YES FOR LIFE - SAY NO TO DRUGS నినాదంతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో DMO ప్రవీణ్ రెడ్డి, మాజీ సైనికుడు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI