Jagtial: ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలి జగిత్యాల కలెక్టర్!
Jagtial: జగిత్యాల రూరల్ ప్రజావాణిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
Jagtial: ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలి జగిత్యాల కలెక్టర్!
Jagtial: ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీని అధికారులు సకాలంలో, సమర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రజల నుండి వినతుల స్వీకరణ విధానాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకే గత వారం నుండి మండల స్థాయిలో ప్రజావాణిని ప్రారంభించినట్లు తెలిపారు.
అర్జీదారుల సమస్యలను సానుభూతితో విని, శాఖల మధ్య సమన్వయంతో త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తోందని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో రమా దేవి, తహసీల్దార్ హకీమ్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




