Karimnagar: ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్!
Karimnagar: కరీంనగర్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై ఆదేశాలు ఇచ్చారు.
Karimnagar: ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్!
కరీంనగర్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, గడువులోగా పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు.
క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్ వైజర్లు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వాటి స్వీకరణ ప్రక్రియతో పాటు సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్న విధానాన్ని కమీషనర్ దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం బీఎల్ఓలకు పలు కీలక సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సంధర్బంగా నగరపాలక సంస్థ కమీషనర్ ( ఈ ఆర్ ఓ) ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితాను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించేలా చర్యలు తీస్కోవాలని సూచించారు. ఒకే ఇంటి నంబర్‌పై నమోదైన డూప్లికేట్ ఓట్లను క్షుణ్ణంగా గుర్తించి తొలగించాలని ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకమైన తుది జాబితాను సిద్ధం చేయాలన్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడిని ఓటరుగా చేర్పించేర్చాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులు, సూపర్ వైజర్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.




