Karimnagar: మానేరు డ్యామ్ వద్ద కమిషనర్ తనిఖీలు.. వేసవిలో తాగునీటిపై ప్రత్యేక నిఘా!
Karimnagar: కరీంనగర్ నగరంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.
Karimnagar: మానేరు డ్యామ్ వద్ద కమిషనర్ తనిఖీలు.. వేసవిలో తాగునీటిపై ప్రత్యేక నిఘా!
కరీంనగర్: నగర ప్రజలకు తాగునీటి సరఫరా లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరా లో భాగంగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మానేరు డ్యాం సమీపంలో గల భూస్టర్ పంపులను సందర్శించారు. మానేరు డ్యాం నుండి నీటి శుద్దీకరణ కేంద్రంకు నీటిని సేకరించే భూస్టర్ పంపుల పని తీరును తనిఖీ చేసి పరిశీలించారు. బూస్టర్ పంపుల పనితీరు పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం దృష్ట్యా నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పంపుల నిర్వహణలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం అమృత్ 2.0 పథకంలో భాగంగా నూతనంగా నిర్మాణం చేస్తున్న రా వాటర్ సంపు, రిజర్వాయర్ అభివృద్ధి పనులను తనిఖీ చేసి పరిశీలించారు. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ దేవేంధర్, ఏఈ భీంవర్ధన్, ఫిల్టర్ బెడ్ ఇంచార్జ్ అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.




