Sircilla: సిరిసిల్ల జీజీహెచ్‌లో ఎమర్జెన్సీ సేవలపై రోగుల ఆందోళన

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందక రోడ్డు ప్రమాద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Oct 2026 9:46 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జీజీహెచ్‌లో ఎమర్జెన్సీ సేవలపై రోగుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవల తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్యం అందించడంలో జాప్యం జరుగుతోందని, ఎమర్జెన్సీ విభాగంలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చినప్పటికీ వెంటనే వైద్య సేవలు అందకపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. సరిపడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన వారికి సైతం సకాలంలో వైద్యం అందకపోతే ఎలా అంటూ రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో పర్యవేక్షణ తీరుపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యవసర వైద్య సేవలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, రోగులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైద్య సేవల్లో జాప్యానికి గల కారణాలపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA