Jammikunta: జమ్మికుంటలో ఓట్ల సవరణపై ప్రణవ్ బాబు, నరేందర్ రెడ్డి సమీక్ష
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి, వొడితల ప్రణవ్ బాబు మంగళవారం పరిశీలించారు.
Jammikunta: జమ్మికుంటలో ఓట్ల సవరణపై ప్రణవ్ బాబు, నరేందర్ రెడ్డి సమీక్ష
Jammikunta: బిఎల్ఏలకు దిశా నిర్దేశం,ప్రతి ఓటు చాలా ముఖ్యం.బిఎల్ఓలతో క్రమం తప్పనిసరిగా బూత్ ఏజెంట్లు పాల్గొనాలి.ఇక్కడున్న ఎమ్మెల్యే కాంట్రవర్సీలకు తప్ప,ప్రజలకు చేసింది ఏం లేదు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సర్ ప్రక్రియలో పాల్గొన్న సుడా చైర్మెన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు.ప్రతి బూత్ కి సంబంధించి ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని, బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఓటర్లకు వారి అనుమానాలు నివృత్తి చేయడానికి బిఎల్ఏ లు కృషి చేయాలని,
ఓట్ల సమగ్ర సవరణలో జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం రోజున జమ్మికుంట పట్టణంలోని 4, 5,19, 27, 28, 30 వార్డులలో బూత్ కో ఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ఓటు సమగ్ర సవరణ (సర్) కార్యక్రమ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా వార్డులలో తిరుగుతున్న సమయంలో ఓటర్లు పలు ప్రశ్నలు వేయగా వాటికి బూత్ లెవెల్ ఆఫీసర్లతో మాట్లాడి అనుమానాలు నివృతిచేసేవిధంగా మాట్లాడారు. అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి పది బూత్ లకు ఒక్కరితో జమ్మికుంట పట్టణానికి 4గురు కో ఆర్డినేటర్లు నియమించడం జరిగిందని, వారు నిరంతరం ఏజెంట్లతో సమన్వయం చేస్తూ వేగవంతం చేయాలని సూచించారు.
ఇక్కడున్న ఎమ్మెల్యే కాంట్రవర్సీలకు తప్ప,ప్రజలకు చేసింది ఏది లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను విమర్శించే ముందు 10ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు మేం చేసిన పనులు ఎందుకు చేయలేదో ఆత్మ విమర్శన చేసుకోవాలనిమండిపడ్డారు. కాళేశ్వరంకట్టిలక్షలకోట్లు దోచుకొని, కూళేశ్వరంగా మార్చి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తూ పేదవాడి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజవర్గ సర్ కో ఆర్డినేటర్, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు,మున్సిపల్ కౌన్సిలర్లు, యూత్నాయకులు, మహిళ నాయకురాళ్లు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




