Sircilla: తంగళ్లపల్లిలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఓటు చోరీపై నిరసన తెలిపారు.
Sircilla: తంగళ్లపల్లిలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్!
Sircilla: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని దేశంలో ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటు చోరీ నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జలగం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు కలిగిన భారతీయ పౌరుల ఓట్లను తొలగించి తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నాలను అరికట్టాలని అన్నారు. ఓటు చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు, సర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జలగం ప్రవీణ్ కుమార్, నేరెళ్ల నర్సింగం, మండల మహిళా అధ్యక్షురాలు హారిక, పొన్నాల పరశురాములు, బీసీ సెల్ నాయకుడు చిలుక శ్రీనివాస్, రాజేశ్వరరావు, లింగాల భూపతి, బండి పరశురాం, పయ్యావుల శ్రీనివాస్, సుద్దాల కరుణాకర్, రాపెల్లి ఆనందం, ప్రశాంత్, రంగు శ్రీనివాస్, పెద్దూరి తిరుపతి, సుద్దాల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, కరుణాకర్, భరత్, తిరుపతి, సందీప్, లక్ష్మణ్, చిలుక శ్రీనివాస్, బాబు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




