Sircilla: సిరిసిల్ల రైతు భరోసా నిధుల విడుదలతో కాంగ్రెస్ సంబరాలు

Sircilla: సిరిసిల్లలో రైతు భరోసా నిధుల పంపిణీపై కాంగ్రెస్ సంబరాలు. తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నాయకులు.

KALEEM, SIRICILLA
Published on: 8 July 2026 3:48 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల రైతు భరోసా నిధుల విడుదలతో కాంగ్రెస్ సంబరాలు

సిరిసిల్ల: తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేలా రాజు అన్నారు.

రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేలా రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ పెద్దల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మునిగేలా రాజు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని అన్నారు. రైతు భరోసా పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లను జమ చేయడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

అలాగే రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు రైతులు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story