Karimnagar: ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం

Karimnagar: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ పనికిమాలిన రాజకీయం చేస్తోందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మండిపడ్డారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Oct 2026 7:42 PM IST
Karimnagar
X

Karimnagar: ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం

కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ పనికిమాలిన రాజకీయం చేస్తోందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ కొత్తపల్లి మండలంలో నిర్వహించిన పోలింగ్ బూత్ సమావేశం ,ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' వీక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నకిలీ ఓట్లను, మరణించిన వారి ఓట్లను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.గతంలో 1952, 1957, 1961, 1965-66, 1983-84, 1987-89, 1992-95, 2002-2004 సంవత్సరాల్లో కూడా ఈ సవరణలు జరిగాయని, సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ 2025-2026 లలో ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని గుర్తుచేశారు.

ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కాంగ్రెస్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ , ఎన్నికల వ్యవస్థపై అసత్య ప్రచారాలు చేస్తోందనిమండిపడ్డారు. దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 50 ఏళ్లు పాలించిందని, ఇన్ని దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఓట్ చోరీ చేసే అధికారంలో కొనసాగిందా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన రాజకీయాలు చేసి , మోడీ ప్రభుత్వంపై బురద జల్లడానికి. దేశ వ్యతిరేక శక్తులతో కలిసి ఇలాంటి రాజకీయాలు చేస్తుందని ఘాటుగా విమర్శించారు.

దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయిందని , ప్రధానంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో దేశానికి వలస వచ్చి అక్రమంగా ఓటు పొందిన రోహింగ్యాలు , మైనార్టీల ఓటు తొలగిస్తున్నారనే నేపంతోనే కాంగ్రెస్ గగ్గోలు పెడుతుందన్నారు.నకిలీ ఓట్ల తొలగింపును కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది?రాహుల్ గాంధీ "ఓట్ చోరీ" ఆరోపణలు అర్థరహితనన్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలా

నవంబర్ 3న కరీంనగర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 5న కరీంనగర్‌లో నిర్వహించనున్న భారీ ర్యాలీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతున్నట్లు ప్రవీణ్ రావు వెల్లడించారు. ఈ ర్యాలీలో యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ర్యాలీని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు తగిన కృషి చేయాలని తెలిపారు. సమావేశ అనంతరం ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ప్రవీణ్ రావు వీక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంట తిరుపతి, శక్తి కేంద్ర ఇన్చార్జ్ వేముల అనిల్ కుమార్, బూత్ అధ్యక్షులు ఎగ్గొజు సంపత్ చారి, బోనాల పరశురాము, గ్రామ సర్పంచ్ నునుగొండ మానస ప్రవీణ్ వార్డు మెంబర్లు రుద్ర రాజ్ కుమార్, పెంట సురేష్, సీనియర్ నాయకులు మెరుగు మల్లేశం, వరాల మల్లేశం, పెంటి సంతోష్ కుమార్, గీ గురు చందు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN