Sultnabad: సుల్తానాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో విద్యుత్ నిరసన ధర్నా!

Sultnabad: వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ ఈటెల రాజేందర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మండిపడ్డారు.

KONDAL, SULTANABAD
Published on: 30 Sept 2026 1:38 PM IST
Sultnabad
X

Sultnabad: సుల్తానాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో విద్యుత్ నిరసన ధర్నా!

Sultnabad:వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి సబ్ స్టేషన్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రీ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి ఈటెల రాజేందర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హాజరై సంఘీభావం తెలిపారు.

​ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు:

​కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు: చాలా ఏండ్ల తరువాత మళ్లీ కరెంట్ సమస్యలు మొదలయ్యాయని, సరైన విద్యుత్ సరఫరా లేక రైతుల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

​హామీలు విఫలం: 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, కనీసం రోజుకు 8 గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేకపోతోందని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటని విమర్శించారు.

​రైతుల సంక్షేమంపై నిర్లక్ష్యం: వర్షాకాలంలో కూడా పంటలకు నీరు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనడానికి రైతుల గోసే నిదర్శనమని, రైతులను ఏడిపించిన ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించలేదని హెచ్చరించారు.

​సాగునీరు అందించాలి: భేషజాలకు పోకుండా తెలంగాణలోని ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటిని వెంటనే రైతులకు సాగునీరుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD