Choppadandi: రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. సుంకే రవిశంకర్ ఫైర్!

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాస్తారోకో చేపట్టారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 28 April 2026 12:25 PM IST
Choppadandi
X

Choppadandi: రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. సుంకే రవిశంకర్ ఫైర్!

Choppadandi: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాస్తారోకో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లాలలో పోసినటువంటి ఒక దాన్య గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు కొంతమంది ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశామని గొప్పలు కొడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను వెన్నుపోటు పొడుస్తుంది 25 రోజులుగా ధాన్యం కొనకుండా కొర్రీలు పెడతా ఉంది జిపిఎస్ అనే నూతన విధానాన్ని కాంగ్రెస్ తీసుకువచ్చింది వరి ధాన్యం పుట్టుపుట్లుగా పండింది రైసు మిల్లులను మాత్రం అరకొరగా అలాట్మెంట్ చేస్తున్నారు.

మరి ఈ ధాన్యాన్ని ఎక్కడ పోస్తారు అనే ఆలోచన లేకపోతే ధాన్యాన్ని కొనపోతే రైతులు అడ్డికి పావు సేరు బయట ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుల ద్రోహాల ప్రభుత్వాలని విమర్శించారు సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తడిసిన మొలకెత్తిన చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు ఆనాడు రైతుబంధు తోపాటు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు అందించాము కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా మూడుసార్లు ఎగ్గొట్టింది అని విమర్శించారు వెంటనే జిపిఎస్ ఆన్లైన్ విధానాన్ని రద్దుచేసి మా కెసిఆర్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన విధంగా కొనుగోలు చేసే వరకు మా బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story