Sultanabad: కాట్నపల్లిలో విత్తన మేళా సబ్సిడీ విత్తనాలు పంచిన విప్ విజయరమణ రావు!
Sultanabad: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదికలో విత్తన మేళాను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
Sultanabad: కాట్నపల్లిలో విత్తన మేళా సబ్సిడీ విత్తనాలు పంచిన విప్ విజయరమణ రావు!
సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైతు వేదికలో వానకాలం సీజన్ సందర్బంగా విత్తన మేళా మరియు రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాల కార్యక్రమాన్ని ప్రారంభించి సబ్సిడీపై రైతులకు విత్తనాలు పంపిణి చేసిన గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తామని భరోసా ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం, క్వింటాల్ సన్న వడ్లకు ₹500 బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ₹1,750 కోట్ల బోనస్ నిధులు కేటాయించగా, ఒక్క పెద్దపల్లి నియోజకవర్గానికే ₹88 కోట్ల 40 లక్షల బోనస్ రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే సుల్తానాబాద్ మండలానికి ₹16 కోట్ల 12 లక్షలు, కాట్నపల్లి గ్రామానికి ₹62.91 లక్షలు, నర్సయ్యపల్లికి ₹25.75 లక్షలు, బొంతకుంటపల్లి రైతులకు ₹33.15 లక్షల బోనస్ అందిందని వివరించారు.
విపక్షాలపై ధ్వజం:
గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు రకాల మేలైన పంట రకాలను ఎంపిక చేసి రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు, మక్కలు, కందులు వంటి ఏ పంటను సక్రమంగా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు.
పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అక్కడి మొక్కజొన్నలను ఇక్కడ దొంగతనంగా అమ్ముకుంటుంటే స్థానిక బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం మద్దతు ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా ₹2,400 మద్దతు ధరతో 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేసిందని గుర్తుచేశారు.
శాస్త్రీయంగా ఎంపిక చేసిన 7 రకాలు:
అంతర్జాతీయ మార్కెట్ మరియు ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ నిపుణుల సబ్ కమిటీ సూచించిన సాంబ మసూరి (BPT), తెలంగాణ సోన, హెచ్ఎంటి (HMT) సోన, జై శ్రీరామ్, కూనారం సన్నలు (1638), వరంగల్ 4444 (సిద్ది), KNM 7715 అనే ఏడు రకాల సన్న వడ్లను మాత్రమే రైతులు సాగు చేయాలని, వీటికి ప్రభుత్వం పూర్తి బోనస్ అందిస్తుందని స్పష్టం చేశారు. అలాగే రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రీయ ఎరువులను వాడాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, గ్రామ సర్పంచ్ మరియు వ్యవసాయ అధికారులు మరియు సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరియు వార్డు సభ్యులు మరియు రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు మరియు తదితరులు తదితరులు పాల్గొన్నారు.




