Sircilla: కాంగ్రెస్ నేత కిషన్ తండ్రి మృతి.. పరామర్శించిన మహేందర్ రెడ్డి

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు అగ్రహారం కిషన్ తండ్రి మృతి చెందారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Aug 2026 9:28 PM IST
Sircilla
X

Sircilla: కాంగ్రెస్ నేత కిషన్ తండ్రి మృతి.. పరామర్శించిన మహేందర్ రెడ్డి

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అగ్రహారం కిషన్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, కేకే యువసేన నాయకులు ఆరుట్ల మహేష్‌తో పాటు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story