Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్‌లో 'చీకటి' రాజకీయం!

Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ ఆరోపించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 26 April 2026 2:19 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్‌లో 'చీకటి' రాజకీయం!

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ లో మొన్న జరిగిన మేయర్, ఎన్నిక.. నిన్న జరిగిన కో-ఆప్షన్ ఎన్నికతో బీజేపి, బిఆర్ఎస్ చీకటి ఒప్పందం బట్టబయలు అయిందని, కార్పొరేటర్ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆరోపించారు.

ఎప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అనడానికి కో-ఆప్షన్ ఎన్నికనే నిదర్శనం. మేయర్ ఎన్నికల్లో బీజేపీ కి సరైన కోరం లేకున్నా అంతర్గతంగా బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారం కోరంను అప్పగించి క్రిబ్ కో స్కాం జరిగిందనేది వాస్తవం కాదా అన్నారు. కో-ఆప్షన్ ఎన్నికల్లో కూడ బీజేపీ కి బీఆర్ఎస్ కార్పోరేటర్లు మద్దతు ప్రకటించడం అనేది వారి అంబూజ బంధానికి నిలువెత్తు నిదర్శనం అని తెలిపారు.

అధికారంలో ఉండి కో-ఆప్షన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికల్లో ఓటు వేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ గుట్టును, చీకటి ఒప్పందాన్ని ప్రజల ముందు ఉంచాలనే నిర్ణయంతోనే కో-ఆప్షన్ ఎన్నికల్లో పాల్గొనలేదని ఊహించినట్టుగానే రెండు పార్టీల వ్యవహారం బహిర్గతం అయిందని చెప్పారు. బీజేపీ కి 34 మంది సభ్యులు ఉండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ సభ్యులను ప్రలోభపెట్టి వారి బంధాన్ని నిరూపించుకున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తెరచాటు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. రెండు పార్టీలు లోపల తెరచాటు ఒప్పంద రాజకీయాలు చేస్తూనే బయటకు మాత్రం బండి దెబ్బకు బీఆర్ఎస్ విలవిల అని పత్రిక ప్రకటను ఇవ్వడం సిగ్గుపడాలి.ఇలాంటి తెరచాటు రాజకీయాలు, బ్లాక్ మేయిల్ రాజకీయాలు, క్రిబ్ కో రాజకీయాలు, డ్రామా రాజకీయాలు, చీకటి ఒప్పందాలు చేయడం బీజేపీ పార్టీకి ఆ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని నిరూపితమైందన్నారు.

మేము నిజాయితీ గల వ్యక్తులు, మా పార్టి నిజాయితీ గల పార్టీ అంటూ కొంత మంది నాయకులు జబ్బలు చర్చుకుంటారు కదా నిన్న ఎక్కడ పోయింది మీ నిజాయితీ ఏమైంది మీ నిజాయితీ ఆవిరి అయిపోయిందా. అని ఎద్దేవా చేశారు.

* క్రిబ్ కో వ్యవహారం తో ఓటు వేయించుకొవడం మీ నిజాయితా?

మున్సిపల్ చట్టానికి విరుద్దంగా నగరపాలక సంస్థ లో ప్రాతినిధ్యం ఉన్న వర్గాలకు కో-ఆప్షన్ పదవులు ఇవ్వడం నిజాయితా అన్నారు.భారతీయ జనతా పార్టీది అంతా ఒక డ్రామా ప్రజలను మభ్యపెట్టేందుకు తప్పు దోవ పట్టించేందుకు చెప్పేది ఒకటి చేసేది మరోటి. ఎన్నటికైనా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే ఇదే నిదర్శనం అన్నారు.

ఈ బిజెపి టిఆర్ఎస్ పార్టీలను ప్రజలు ఎప్పటికి నమ్మరు ఈ పార్టీల కపట నాటకాలన్నీటిని ప్రజలు గమనిస్తున్నారు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పుతారన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల వైఖరీ ఏమిటో నిన్నటి కో-ఆప్షన్ ఎన్నికతో మరో సారి బహిర్గతం అయింది. కపట నాటకాలు, డ్రామాలతో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలనే ప్రయత్నం మీ భ్రమ.

ప్రజా పాలనకు ప్రజల అండ ఉన్నంత కాలం అంబూజ పార్టీల ఆటలు ఎన్నటికి సాగవు అని అంజన్ కుమార్ తెలియజేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story