Manthani: కమాన్‌పూర్‌లో ఘనంగా దివంగత నేత వైఎస్సార్ వర్ధంతి!

Manthani: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

SHANKAR, MANTHANI
Published on: 2 Sept 2026 10:30 PM IST
Manthani
X

Manthani: కమాన్‌పూర్‌లో ఘనంగా దివంగత నేత వైఎస్సార్ వర్ధంతి!

మంథాని: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలు, మాల వేసి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ఆర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్వర్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగించారన్నారు. ఆయన పరిపాలనను ప్రతిపక్ష నాయకులు సైతం మెచ్చుకునే స్థాయిలో వైఎస్ఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్‌కే దక్కుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుకునే అవకాశం కల్పించారని తెలిపారు. అలాగే జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ రైతుల పొలాలకు నీరు అందించేందుకు కృషి చేసిన రైతు పక్షపాతి వైఎస్ఆర్ అని కొనియాడారు.

వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకున్న ప్రజా అనుకూల నిర్ణయాలు నేటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎస్ ఎస్ అన్వర్ అన్నారు. పేదలు, రైతులు, విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే వైఎస్ఆర్ పాలన లక్ష్యంగా ఉండేదని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మాజీ ఎంపీపీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story