Jammikunta: జమ్మికుంట గాంధీ చౌరస్తాలో రాజీవ్ గాంధీ వర్ధంతి

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది.

GANESH, JAMMIKUNTA
Published on: 21 May 2026 1:33 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట గాంధీ చౌరస్తాలో రాజీవ్ గాంధీ వర్ధంతి

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీచౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశీని కోటి & జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ములుగురి సదయ్య మాట్లాడుతూ భారత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించాము రాజీవ్ గాంధీ అతిపిన్నవయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి సాంకేతిక టెక్నాలజీని రంగంలో సంస్కరణలు తీసుకురావడం వల్లనే ఈరోజు మనం టెలిఫోన్ సెల్ ఫోన్స్ & ఇంటర్నెట్ వాడుతున్నాం.

అంటే అప్పుడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలు అని చెప్పక తప్పదు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంటే దాన్ని 18 సంవత్సరాలకే కుదించిన ఘనత కూడా రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు అనేకమైన అభివృద్ధి పనులతో పాటు యువత రాజకీయాల్లోకి రావాలని ఈ దేశానికి యువతే వెన్నుముక అని యువతను ప్రోత్సహించినారు రాజీవ్ గాంధీ ఆశయల కోసం ఈరోజు రాహుల్ గాంధీ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒక సైనికుల పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని పిలుపు నిచ్చారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి దుబ్బ మల్లన్న చైర్మన్ ముద్దమల్ల రవీందర్ మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వరరావు గౌరవ కౌన్సిలర్ చందా రాజు కుదాడి తిరుపతి మాచర్ల రాజు ఉగ్గు రమేష్ పాతకాల అనిల్ కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి రవీందర్ బొంగోని వీరన్న రామ్ రెడ్డి పంజాల అజయ్ దొడ్డ శ్రీకాంత్ పొన్నగంటి మధు మైనార్టీ సెల్ అధ్యక్షులు సలీం యూత్ కాంగ్రెస్ నాయకులు గంగారపు మహేష్ ఎలగందల శ్రీహరి దేవనూరు వినయ్ లింగారావు పోతుల శ్రీనివాస్ చిన్నింటి నాగేందర్ పవన్ ప్రవీణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story