Yellareddypet: వేణుగోపాలస్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు!

Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో కార్తీక పౌర్ణమి వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొని శ్రీ వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Nov 2026 12:58 PM IST
Yellareddypet
X

Yellareddypet: వేణుగోపాలస్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వేణుగోపాలస్వామి గరుడసేవ ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు.

అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మేడిపల్లి దేవానందం స్వామివారిని దర్శించుకోగా, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శుద్ధి రాజేందర్, ఏఎంసీ చైర్మన్ మేడిపల్లి దేవానందం, వైస్ చైర్మన్ నందకిషన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే సాహెబ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA