Karimnagar: కరీంనగర్‌లో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దహనం!
Karimnagar: అసెంబ్లీ స్పీకర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.
Karimnagar: కరీంనగర్‌లో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దహనం!
Karimnagar: కరీంనగర్ తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న వేళ కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాత మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్నం చేసినట్లు తెలిపారు. టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిర్బంధాల మధ్య పాలన కొనసాగించి నేడు స్వేచ్ఛగా సమస్యలపై మాట్లాడమంటే గౌరవప్రదమైన స్పీకర్పై అనుచిత వాక్యాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మరొకమారు దళితులపై అనుచిత వాక్యాలు చేస్తే చూస్తూ ఊరుకోమని బి ఆర్ ఎస్ నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తాత మధుకు చెప్పు చూపిస్తూ ఇలాంటి పునరావృతమైతే నిన్ను చెప్పులతో కొడతామని ఘాటుగా హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి బయలుదేరగా పోలీసులు వారిని వెంబడించి అడ్డుకొని అరెస్టు చేసి తెలంగాణ చౌకి తరలించారు.




