Odela: పెద్దపల్లి జిల్లా ఓదెలలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ చోరీ!

Odela: ఓదెల మండలం పెద్ద కొమిరె మంచిల బావి సమీపంలో రన్నింగ్ కరెంట్ ఆఫ్ చేసి మరీ ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ వైర్ ఎత్తుకెళ్లిన దొంగలు.

KONDAL, SULTANABAD
Published on: 23 Sept 2026 11:00 AM IST
Odela
X

Odela: పెద్దపల్లి జిల్లా ఓదెలలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ చోరీ!

Odela: ​ఓదెల మండలంలోని పెద్ద కొమిరె మంచిల బావి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు ఘరానా దొంగతనానికి పాల్పడ్డారు. విద్యుత్ సరఫరా జరుగుతుండగానే (రన్నింగ్ కరెంట్) చాకచక్యంగా పవర్ ఆఫ్ చేసి, ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు.

​సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ చోరీ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD