Karimnagar: కార్పొరేటర్లకు ఫోన్ల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం!
Karimnagar: ఫోన్ల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రూ.28 లక్షల ప్రజాధనాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారంటూ సిపిఎం నగర కార్యదర్శి
Karimnagar: కార్పొరేటర్లకు ఫోన్ల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం!
కరీంనగర్: కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యుల ఫోన్ల కోసం రూ: 28 లక్షలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మున్సిపల్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు.
నగరంలోని ప్రజలు చెల్లిస్తున్న నీటి పన్ను, చెత్త పన్ను, ఇంటి పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బుల కార్పొరేటర్లకు, కౌన్సిల్ సభ్యులకు ఫోన్లు కొనివ్వడం సిగ్గుచేటు అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజావాణి, ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉన్నాయని, అయినప్పటికీ ఒక్కో కొత్త ఫోను కు 40, వేల రూపాయలు వెచ్చించి 70 ఫోన్ లను కొనుగోలు చేసి 28 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
ఇప్పటివరకు కార్పొరేటర్లకు ఫోన్లు లేవా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఒక్కో కార్పొరేటర్ కు రెండు మూడు ఫోన్లు ఉన్నాయని, ఫోను లేని కార్పొరేటర్ కరీంనగర్లో లేరని అయినా ఫోన్ లో కొనుగోలుకు ప్రజాధనాన్ని వెచ్చించడమేంటని ప్రశ్నించారు.
గత పాలకవర్గం ఏర్పాటైన మొదట్లో కార్పొరేటర్ లందరికీ ఫోన్లు కొని, పదవి కాలం పూర్తయిన వెంటనే తిరిగి తీసుకున్నారని ఆ ఫోన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
నగరంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని చిరుజల్లులకే సుభాష్ నగర్, మంచిర్యాల చౌరస్తా, గాంధీ రోడ్, హాస్పటల్ స్ట్రీట్ జలమయం అవుతున్నాయని, కుప్పలు తిప్పలుగా చెత్త పేరుకు పోతుందని, వీధిలైట్లు, డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పరిష్కరించవలసిన అధికారులు ప్రజాధనంతో కార్పొరేటర్లకు ఫోన్లు కొనుగోలు చేయడమేంటని అన్నారు.
ఇప్పటికైనా టెండర్లను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.




