Karimnagar: కరీంనగర్‌లో మిలాద్-ఉన్-నబి కమిటీలతో సీపీ గౌష్ ఆలం సమావేశం!

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు, మిలాద్ కమిటీ సభ్యులతో సీపీ గౌష్ ఆలం సమావేశమయ్యారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 24 Aug 2026 11:25 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో మిలాద్-ఉన్-నబి కమిటీలతో సీపీ గౌష్ ఆలం సమావేశం!

కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా నగరంలోని మర్కజీ మిలాద్ కమిటీ, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ, మదరసా అన్వార్ ఉల్ ఉలూమ్ కమిటీల పెద్దలతో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ, మిలాద్ ఉన్ నబి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. పండుగలకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా చివరి రోజు జరిగే జులూస్ శాంతియుతంగా జరగాలని ఆయన సూచించారు.

శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సాధారణ షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి , తిరుమల్ గౌడ్ మరియు మిలాద్ ఉన్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story