Karimnagar: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం చేతుల మీదుగా ల్యాండ్‌స్కేపింగ్ ప్రారంభం!

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (MT) విభాగంలో సీపీ గౌష్ ఆలం నూతన ల్యాండ్‌స్కేపింగ్, సుందరీకరణ పనులను ప్రారంభించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 14 Oct 2026 9:27 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం చేతుల మీదుగా ల్యాండ్‌స్కేపింగ్ ప్రారంభం!

Karimnagar: పోలీస్ కార్యాలయాల పరిసరాలు ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా ఉన్నప్పుడే సిబ్బంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించగలరని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (MT) విభాగం కార్యాలయం ముందు నూతనంగా చేపట్టిన ల్యాండ్‌స్కేపింగ్, సుందరీకరణ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం మానసిక ఒత్తిడితో కూడిన బాధ్యతలు నిర్వర్తిస్తుంటారని, అలాంటి వాతావరణంలో కార్యాలయ ప్రాంగణాల్లో పచ్చదనం, పరిశుభ్రత వారికి ఎంతో ప్రశాంతతను అందిస్తాయని తెలిపారు. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ముందు ఖాళీ స్థలాన్ని ఆకర్షణీయమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు (లాన్), సుందరమైన డిజైన్లతో ల్యాండ్‌స్కేపింగ్ చేసి ఆహ్లాదకర వాతావరణం కల్పించడం అభినందనీయమన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్, అనుబంధ కార్యాలయాల పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, అభివృద్ధి చేసిన ఈ సుందరీకరణను నిరంతరం పరిశుభ్రంగా, పచ్చగా కాపాడుకోవాలని సంబంధిత అధికారులకు సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం అధికారి ఆర్ఐ కిరణ్ కుమార్, రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి ఆర్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN