Manakondur: ‘బాల్ పంచాయతీ’ హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి, సీపీ గౌస్ ఆలాం

Manakondur: పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల్ పంచాయతీ’ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీ గౌస్ ఆలాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 6 Jun 2026 5:04 PM IST
Manakondur
X

Manakondur: ‘బాల్ పంచాయతీ’ హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి, సీపీ గౌస్ ఆలాం

మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో పోలీసుల ఆధ్వర్యంలో బాల్ పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ , సీపీ గౌస్ ఆలాం హాజరయ్యారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి, పిల్లలతో స్వాగత నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం చిల్డ్రన్స్ పార్లమెంట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ విజయ్ కుమార్, ఎంపీడీవో వరలక్ష్మీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, సర్పంచ్ తాళ్లపల్లి వర్షిణి, ఎంఈఓ శ్రీనివాస్,సీ టీమ్ ఇన్చార్జి స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story