Karimnagar: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన భారీ గంజాయి దగ్ధం!
Karimnagar: కరీంనగర్ సిపీ గౌస్ ఆలం ఐపీఎస్ ఆధ్వర్యంలో 38 కేసుల్లో పట్టుబడిన 63 కిలోల గంజాయిని మానకొండూరు ఇన్సినేటర్ లో దహనం చేశారు.
Karimnagar: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన భారీ గంజాయి దగ్ధం!
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి మరియు 1 గంజాయి మొక్కను ఈరోజు (బుధవారం) ధ్వంసం చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




