Karimnagar: కరీంనగర్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సిపి గౌష్ ఆలం ఆకస్మిక తనిఖీలు!
Karimnagar: కరీంనగర్ ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సిపి గౌష్ ఆలం ఆకస్మిక తనిఖీలు. సిబ్బంది హాజరు, డ్యూటీల కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలని ఆదేశం.
Karimnagar: కరీంనగర్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సిపి గౌష్ ఆలం ఆకస్మిక తనిఖీలు!
కరీంనగర్: కరీంనగర్ సిటీ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జిల్లా ఏఆర్ (Armed Reserve) పోలీస్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ల (RI) కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లోని వివిధ విభాగాలను సందర్శించిన సీపీ, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు.
హెడ్ క్వార్టర్స్‌లోని సిబ్బంది నామినల్ రోల్స్ (Nominal Rolls) ను పరిశీలించిన సీపీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బంది ఆడిట్, వివిధ విభాగాలకు విధులను కేటాయించే ప్రక్రియపై (Staff Allocation) అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రతి ఒక్కరికీ సమానంగా, పారదర్శకంగా విధులు కేటాయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ:
"పోలీస్ శాఖలో అంతర్గత పరిపాలన, రికార్డుల నిర్వహణ అత్యంత కీలకం. సిబ్బంది హాజరు, విధుల కేటాయింపుల్లో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు. ప్రతీ రికార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ పక్కాగా నిర్వహించాలి. విధుల్లో జవాబుదారీతనం లోపిస్తే కఠిన చర్యలు తప్పవు."
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే, శాంతిభద్రతల పరిరక్షణలో ఏఆర్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న పరిపాలనా పరమైన ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు రజినీకాంత్, జానిమియా, కిరణ్ కుమార్, ఆర్ఎస్ఐలు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




