Karimnagar: బిజెపి హయాంలో ప్రజలపై పెనుభారం: సిపిఐ ధ్వజం!
Karimnagar: కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో 9 రోజుల ప్రచార జాతా ప్రారంభమైంది.
Karimnagar: బిజెపి హయాంలో ప్రజలపై పెనుభారం: సిపిఐ ధ్వజం!
కరీంనగర్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో 9 రోజులపాటు నిర్వహించే ప్రచార జాతాను మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు.
నగరంలోని పద్మ నగర్ లో ప్రారంభించిన ఈ ప్రచార జాతాను జిల్లాలో ప్రజలందరికీ వివరిస్తూ 9 రోజులపాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం కోసం దేశ ప్రజలకు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిందని అధికారం చేజిక్కించున్న తర్వాత హామీల ఊసే లేకుండా పరిపాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు.
దేశంలో సుపరిపాలన అందిస్తామని ప్రజలను నమ్మించి అధికారంలో కొనసాగుతుందని, అచ్చే దిన్ ఆగయా అంటూనే ప్రజల నిత్యావసరవస్తువుల ధరల పెంచి పెనుబారం మోపడం వల్ల ప్రజలు సచ్చేదిన్ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని,విద్యా,వైద్య సదుపాయం పేదలకు అందడం లేదని,రైతుల కష్టాలు కేంద్రం పట్టించుకోవడం లేదని,కార్మికుల హక్కులను కాల రాస్తుందని,మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని ఇలా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రజలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, రైతులకు ఉపాధి అవకాశాలు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.




