Karimnagar: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా!
Karimnagar: కరీంనగర్ జిల్లాను పూర్తిగా కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా.
Karimnagar: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా!
Karimnagar: కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు, సిపిఐ నాయకులు రైతులు కలిసి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు చేరుకొని ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాను పూర్తిగా కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం 4 మండలాలే కాకుండా మరికొన్ని మండలాలు పూర్తిగా డాట్ ఏరియాలో ఉన్న మండలాలను ప్రకటించకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు.
అధికారులు జిల్లాలో పర్యటించి కరువు ఎక్కడుందో చూసి ఎండిన పంటలు కరువును అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాల్సిన అధికారులు కేవలం కాగితాలకే పరిమితం చేయడం కాదని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో కరువు జిల్లాగా ప్రకటించి, ఎండినా పంటలకు కూడా నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి అధిక నిధులు ఇచ్చి రైతులను రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఉన్నారని వారు క్షేత్రస్థాయిలో అధికారులు చేసిన నివేదికలు తెప్పించుకొని జిల్లాను జిల్లా ప్రజలను రైతులను ఆదుకోవాలని అన్నారు.
కరువు జిల్లాగా ప్రకటించకుంటే రాబోవు రోజుల్లో దశలవారీగా పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.




