Karimnagar: కవుల పాటలే ప్రజలను ఆలోచింపజేస్తాయి సీపీఐ నేత కలవేన శంకర్!
Karimnagar: కరీంనగర్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి శిక్షణా శిబిరం ముగింపు సభ. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతానికి కలవేన శంకర్ పిలుపు.
Karimnagar: కవుల పాటలే ప్రజలను ఆలోచింపజేస్తాయి సీపీఐ నేత కలవేన శంకర్!
Karimnagar: ఏ వేదికలోనైనా రాజకీయ నాయకుల ప్రసంగాలకు ఆకర్షితులు కానీ ప్రజలు కేవలం కవులు,గాయకులు ఆలపించే పాటలకు ఆకర్షితులై ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉంటాయని, ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఉద్యమ చరిత్రను,కార్మికుల పోరాటాలను తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు పాటల రూపంలో,ఒగ్గు కథల,బుర్ర కథల రూపంలో ప్రజలకు వివరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,ప్రజానాట్య మండలి రాష్ట్ర నిర్మాణ బాధ్యులు కలవేన శంకర్ కళాకారులకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణా శిబిరం ముగింపుకు ముఖ్య అతిథిగా హాజరైన కలవేన శంకర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని,105 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అనేకమంది ప్రాణ త్యాగాలతో కూడుకున్న సంఘమని అన్నారు. దేశంలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హక్కులు,చట్టాలు కాపాడడం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నదని, పోరాడి సాధించుకున్న సమ్మె హక్కును కూడా హరిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలపై కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని, నేపథ్యంలో సెప్టెంబర్ 6 వ తేదీ నుండి 8వ తేదీ వరకు కరీంనగర్ నగరంలో జరిగే ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కార్మిక లోకం కదం తొక్కాలని, ఆ మహాసభల కోసమై రెండు రోజులుగా కళాకారులు ఆటా, పాటలు నేర్చుకోవడం అభినందనీయమని, తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు కార్మిక వర్గ సమస్యలు,పోరాటాలు ప్రజలకు కళ్లకు కట్టేవిధంగా వివరించేందుకు పాటలు పాడాలని,మారుతున్న సమకాలిన రాజకీయాలలో నాయకుల మాటల కంటే గాయకుల పాటలే ఎక్కువగా ప్రజలకు చేరువవుతున్నాయని, కళాకారులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తమ సాంస్కృతిక కళా నైపుణ్యాన్ని రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే ర్యాలీలో,బహిరంగ సభలో ప్రదర్శించాలని శంకర్ పిలుపునిచ్చారు.
ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి,ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్,టేకుమల్ల సమ్మయ్య, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉప్పలయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్,న్యాలపట్ల రాజు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య,ఆసాల రమ,ఇందిరా,సరిత,గుర్రం సదానందం,లక్ష్మణ్,ఎర్రోజు శ్రీనివాస్ డప్పురాజు,బోలుమల్ల రాజమౌళి, బరిగెల విజయ్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.




