Karimnagar: 12 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు సీపీఐ!

Karimnagar: మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ పాలనను, ఢిల్లీలో నీట్ ఆందోళనలపై జరిగిన లాఠీచార్జ్ ను తీవ్రంగా ఖండించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 20 July 2026 10:07 PM IST
Karimnagar
X

Karimnagar: 12 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు సీపీఐ!

కరీంనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తూ,దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై తీవ్ర ఆందోళన జరుగుతుంటే ప్రధాని మోడీ ఒక నియంతలా వ్యవహరిస్తూ కళ్ళుండి చూడలేని కాబోధిలా దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.

కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ పరిపాలన కొనసాగిస్తున్నాడని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వారి సంక్షేమానికి కొమ్ముకాస్తున్నాడని మండిపడ్డారు.

విచ్చలవిడిగా దేశ సంపదను,వనరులను కొల్లగొడుతున్నాడని,పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం వారిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా బీజేపీ ప్రభుత్వం అధికారం చెలాయిస్తుందని అన్నారు.అత్యంత అవినీతి పరులకు, అక్రమార్కులకు అండగా నిలవడమే కాకుండా వారిని బీజేపీ అక్కున చేర్చుకోవడం హేయమైన చర్య అని తెలిపారు.

బిజెపి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు.పన్నెండేళ్ళ పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని,నల్ల డబ్బు తేలేదని,2 కోట్ల ఉద్యగాల మాటలు నీటిమూటలయ్యాయని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్,నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.వికసిత్ భారత్ పేరుతో ప్రజల దృష్టిని మారుస్తుందని,గ్రామీణ ప్రజల బ్రతుకులకు వరప్రసాదం లాంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకే మహాత్మా గాంధీ పేరు తొలగించిందని,రాష్ట్రాలపై భారం వేసిందని ఇలా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్ట్ నెలలో పాదయాత్రలు నిర్వహిస్తామని,సెప్టెంబర్ లో ఛలో డిల్లీకి పిలుపునిచ్చినట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు.

లీకేజీలపై నోరు మెదపని కేంద్రం.దేశంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ నీట్ పేపర్ లీక్ అయినా దోషులను శిక్షించలేదని,కనీసం నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదని,లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులను శిక్షించాలని దిల్లీలో ఆందోళన జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందని,ఆందోళన కారులపై లాఠీచార్జీ చేయడం,బస్పవాయువు ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని దీనిని సీపీఐ ఖండిస్తుందన్నారు. రవిద్యార్థులతో,నిరుద్యోగులతో చెలగాటం ఆడితే ప్రభుత్వం కుప్పకూలక తప్పదని వెంకటరెడ్డి హెచ్చరించారు.

ఈ సమావేశములో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి,న్యాలపట్ల రాజు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story