Sircilla: ప్రపంచ శాంతిపై ప్రధాని మోదీ మౌనం వీడాలి: సీపీఐ నేత డిమాండ్!

Sircilla: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలపై భారత్ స్పందించాలని, ట్రంప్ యుద్ధ వైఖరిని ఖండించాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 9 July 2026 5:43 PM IST
Sircilla
X

Sircilla: ప్రపంచ శాంతిపై ప్రధాని మోదీ మౌనం వీడాలి: సీపీఐ నేత డిమాండ్!

సిరిసిల్ల: ప్రపంచ శాంతిపై భారత్ స్పందించాలి.. ప్రధాని మోదీ మౌనం వీడాలి: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

ప్రపంచంలో రోజురోజుకు యుద్ధ వాతావరణం పెరుగుతోందని, దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణమని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు దెబ్బతిన్నాయని, సాధారణ ప్రజలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చర్చలు, ఒప్పందాలు జరిగినప్పటికీ ట్రంప్ యుద్ధ వైఖరిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు.

ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలు కృషి చేయాలని, ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అమెరికాలో అదానీకి సంబంధించిన కేసు కొట్టివేయడంపై స్పందిస్తూ, ట్రంప్–మోదీ మధ్య ఏదో ఒప్పందం జరిగి ఉండొచ్చని ఆరోపించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story