Karimnagar: ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదు..సీపీఐ!
Karimnagar: కార్గో సర్వీసులను ప్రైవేట్ పరం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం సిగ్గుచేటని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మండిపడ్డారు
Karimnagar: ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదు..సీపీఐ!
కరీంనగర్: లాభాల బాటలో నడిచే ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం సిగ్గుచేటైన చర్య అని వెంటనే ఆర్టీసీ కార్గో ప్రైవేట్ పరం చేసే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలొ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గత ప్రభుత్వం ఆర్టీసీ నష్టపోతుందనే ఉద్దేశముతో ఆర్టీసీలో కార్గోను ప్రవేశపెట్టిందని దీని ద్వారా ఎన్నో లాభాలు ఆర్టీసీ గడిచిందని కానీ నేడు అదే కార్గో అప్పుల ఊబిలోకి పోయిందనే సాకుతో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రవేట్ పరం చేయాలని కుట్రలకు పూనుకోవడం సిగ్గుచేట ఆయన చర్యని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం కార్గో ద్వారా ఏటా వంద నుంచి 120 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయం వస్తుందని దీనిని గతంలో జరిగినటువంటి టెండర్లలో 35 కోట్లకు ఒక ప్రైవేటు సంస్థకు టెండర్ అప్పగించడం చూస్తుంటే ఇందులో అవినీతి జరిగిందని అర్థమవుతుందన్నారు.
ఆర్టిసి సంస్థను కాపాడాల్సినటువంటి పెద్దలే సంస్థను పూర్తిగా నష్టాల్లో చూపించి మూసివేయాలని కుట్రలకు పూనుకోవడం సిగ్గు మాలిన చర్యని ఆయన విమర్శించారు.
కొత్తగా ఏర్పాటు అయిన అగ్రిమెంట్ ఈ ఆగస్టు ఒకటి నుంచి అమలయ్యే అవకాశం ఉందని దీంతో కార్గో పై ఆధారపడ్డ దాదాపు 500 మందికి పైగా హమాలీల బతుకులు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే కార్గో ప్రైవేట్ ఈకరణ నిలిపివేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని పంజాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




