Sircilla: ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమిని గెలిపించాలి: చాడ వెంకటరెడ్డి!
Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ఐక్య కూటమి అభ్యర్థుల తరఫున సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించి బస్సు, నిచ్చెన గుర్తులకు ఓటేయాలని కోరారు.
Sircilla: ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమిని గెలిపించాలి: చాడ వెంకటరెడ్డి!
సిరిసిల్ల: అక్టోబర్ 9న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ఐక్య కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ భద్రత కల్పించడం వంటి ప్రధాన అంశాల కోసం ఐక్య కూటమి పోరాడుతోందన్నారు. ఎన్నికల్లో ఐక్య కూటమి బస్సు గుర్తుకు, అలాగే నిచ్చెన గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్యోగులను కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా అధ్యక్షులు మంద సుదర్శన్, రాష్ట్ర నాయకులు గుంటి వేణు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కాళిదాస్, టీఎంయూ జిల్లా అధ్యక్షులు జి.పి. సింగ్, సిరిసిల్ల డిపో ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల రమేష్, డిపో సెక్రటరీ జె.ఎ.ఎస్.ఎన్. రావు, గ్యారేజ్ సెక్రటరీ టి.వి.సి. రావు, ప్రెసిడెంట్ రవి, టీఎంయూ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరి మల్లేష్, సెక్రటరీ ఎల్.ఆర్. రెడ్డి, చీఫ్ సెక్రటరీ బి. శ్రీనివాస్, గ్యారేజ్ సెక్రటరీ ఏ. శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే జి. వెంకటేశం, జి. శ్రీనివాస్, నరసయ్య, మురళి, వసంతరావు, గౌతమ్, ప్రవీణ్, రమేష్, శ్రీనివాస్‌తో పాటు పలువురు ఆర్టీసీ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.




