Karimnagar: కరీంనగర్‌లో కమ్యూనిస్టుల నిరసన జ్వాలలు.. కలెక్టరేట్ ముట్టడించిన చాడ వెంకటరెడ్డి!
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Karimnagar: కరీంనగర్‌లో కమ్యూనిస్టుల నిరసన జ్వాలలు.. కలెక్టరేట్ ముట్టడించిన చాడ వెంకటరెడ్డి!
కరీంనగర్: పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ సిపిఐ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారం మోపుతున్నరని మండిపడ్డారు. మోడీ పాలనలో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని రోజు రోజుకు గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించేంతవరకు పోరాటాలు చేస్తాం అని తెలిపారు.
ఈనెల 18 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ పెంచిన ధరలపై పోరాటం చేస్తాం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, జాతీయ ఉపాధి హామీ పథకం, లేబర్ కోడులు తీసుకువచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ఉపాధి హామీ పథకం 90 శాతం కేంద్రం 10 శాతం రాష్ట్రం భరిస్తే కొత్తగా తెచ్చిన చట్టం వల్ల రాష్ట్రం 40 శాతం కేంద్రం 60 శాతం భరించడం రాష్ట్రాలను దివాలా తీసేందుకే ఇలా చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన ధరలను తగ్గించకుంటే దేశవ్యాప్తంగా సిపిఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




