Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సిపిఐ ధర్నా.. డబుల్ బెడ్ రూమ్లు పంచండి!

Karimnagar: కరీంనగర్‌లో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 22 Jun 2026 1:10 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సిపిఐ ధర్నా.. డబుల్ బెడ్ రూమ్లు పంచండి!

కరీంనగర్ : అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన బాధితులు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిరుపేదలైన అర్హత ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూములను పూర్తిచేసి నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు.

కూలి చేసుకునే నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా అద్దె ఇండ్లలో ఉంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అలాంటివారికి డబుల్ బెడ్ రూములు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్ రూమ్లను పంపిణీ చేయకుంటే అర్హత కలిగిన నిరుపేదలను తీసుకొని వెళ్లి డబుల్ బెడ్ రూమ్ ల గృహప్రవేశం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

గత ప్రభుత్వం చేసిన విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుందని అలాంటి నిలుపుకొని వాగ్దానాలు రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం వచ్చే విధంగా డబుల్ బెడ్ రూంలో పంపిణీకి పూనుకుంటామని తెలిపారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story