Timmapur: సీపీఐ ఆందోళన.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్

Timmapur: నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తిమ్మాపూర్ తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన సీపీఐ నేతలు పొన్నగంటి కేదారి, బోయిని తిరుపతి.

ANJANEYULU, MANAKONDURU
Published on: 1 July 2026 4:35 PM IST
Timmapur
X

Timmapur: సీపీఐ ఆందోళన.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తిమ్మాపూర్ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో తాసిల్దారు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పొనగంటి కేదారి బోయిని తిరుపతి లు మాట్లాడుతూ మండలంలోని అనేక గ్రామాలలో నిజమైనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని పూర్తిగా గుడిసెలు రేకులలో ఉండే అటువంటి కూడా ఇంకా ఉన్నారని వారిని గుర్తించి తక్షణమే వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్హులైనటువంటి నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో మరియు వెనుకబడిన ఓసి కులాలలో కూడా చాలామంది ఉన్నారని

స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి నిజమైన నిరుపేదలకు న్యాయం చేయలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొన్నగంటి కేదారి, మండల కార్యదర్శి బోయిని తిరుపతి, వంగల భాస్కర్ రెడ్డి ,కాంతాల తిరుపతిరెడ్డి, గంగిపల్లి శంకర్, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story