Choppadandi: CPL-5 క్రికెట్ విజేతలకు ట్రోఫీలు అందించిన ఎమ్మెల్యే సత్యం!

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో నిర్వహించిన CPL-5 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 25 May 2026 9:19 AM IST
Choppadandi
X

Choppadandi: CPL-5 క్రికెట్ విజేతలకు ట్రోఫీలు అందించిన ఎమ్మెల్యే సత్యం!

కరీంనగర్ జిల్లా: చొప్పదండి పట్టణంలో నిర్వహించిన CPL-5 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం హాజరయ్యారు. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా యువ క్రీడాకారులను ఉత్సాహపరిచేలా ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ

“గెలుపు – ఓటములు ఆటలో భాగమే… చివరి వరకు పోరాడే తత్వమే మనిషిని విజేతగా నిలబెడుతుంది” అని పేర్కొన్నారు. క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, ఇలాంటి టోర్నమెంట్లు యువతలో ఐక్యత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం అద్భుత ప్రదర్శనతో విజేతలుగా నిలిచిన 1వ వార్డు జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన 12వ వార్డు జట్టుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రైజ్ మనీ మరియు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story